బీజేపీ జోలికొస్తే వదిలిపెట్టేది లేదు: కేంద్రమంత్రి

ఎన్నికల ప్రచారంలో నేతల మాటలు కోటలు దూకుతున్నాయి.  కొందరు నేతలు హద్దులు దాటి మరి వివాదాస్పద వ్యాఖ్యలు  చేస్తున్నారు.  లేటెస్ట్ గా కేంద్రమంత్రి మనోజ్ సిన్హా ఈ లిస్టులో చేరారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌ లోక్ సభ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మనోజ్ సిన్హా ఘాజీపూర్‌  లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యర్థులపై విమర్శలు చేసే క్రమంలో బీజేపీపై  ఆరోపణలు చేసే వారి అంతుచూస్తాం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  బీజేపీ నేతల పనితీరును ఎవరైనా వేలెత్తి చూపితే వారిని వదిలిపెట్టబోమంటూ హెచ్చరించారు. విమర్శించిన నాలుగు గంటల్లోపు వారి వేళ్లు నరికేస్తామని అన్నారు.  అవినీతిని  నిర్మూలించడం కోసం బీజేపీ ఎంతో కృషి చేస్తుందన్నారు. బీజేపీ కార్యకర్తలపై ఆరోపణలు చేసేవారి కళ్లు కూడా ఆరోగ్యంగా ఉండవంటూ శాపాలు చేసి వివాదంలో నిలిచారు.

Latest Updates