చిదంబరానికి నిర్మలా సీతారామన్ కౌంటర్

న్యూఢిల్లీ: మాజీ ఆర్థికమంత్రి , కాంగ్రెస్‌‌ నాయకుడు పి. చిదంబరం ప్రస్తావించిన  పలు  అనుమానాల్ని క్లారిఫై  చేయడానికి  ఫైనాన్స్‌‌ మినిస్టర్‌‌ నిర్మలా సీతారామన్‌‌  రాజ్యసభలో సగానికిపైగా సమయం కేటాయించారు. శుక్రవారం బడ్జెట్‌‌పై జరిగిన చర్చలో పాల్గొన్న చిదంబరం…  అయిదేళ్లలో ఐదు ట్రిలియన్‌‌ అమెరికన్‌‌ డాలర్లకు దేశ ఆర్థిక వ్యవస్థ  చేరుకుంటుందన్న సర్కార్‌‌ విజన్‌‌పై చాలా డౌట్స్‌‌ వ్యక్తంచేశారు. రాజ్యసభలో  ఆయన లేవనెత్తిన పలు సందేహాలను క్లారిఫై చేయడానికి సీతారామన్‌‌… 102 నిమిషాల రిప్లైలో 45 నిమిషాలు కేటాయించారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి దేశ ఎకానమీ రెండింతలు అవుతుందన్న చిదంబరం మాటలు నిజమైతే… యూపీఏ  గవర్నమెంట్‌‌ ఆర్థికవ్యవస్థపై ఎందుకు దృష్టిపెట్టలేదని, స్కామ్‌‌లు ఎక్కువ ఎందుకు జరిగాయని ప్రశ్నించారు.  మాజీ ఆర్థికమంత్రుల నుంచి నేర్చుకోవడానికి తాను ఎంతో ఇష్టపడతానని సీతారామన్‌‌ చెప్పారు. తాము టార్గెట్‌‌ పెట్టుకున్నవన్నీ  సాధించతగ్గవేనని అన్నారు.

ఈబీసీ స్టూడెంట్స్‌‌కు 4,800  ఎంబీబీఎస్‌‌ సీట్లు

నిరుపేద వర్గాలకు చెందిన స్టూడెంట్స్‌‌కు (ఈబీసీ) ఈ ఏడాది   4,800 ఎంబీబీఎస్‌‌సీట్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి హర్షవర్థన్‌‌ చెప్పారు. గత రెండేళ్లలో మెడిసిన యూజీ సీట్లు 15,815 , పీజీ సీట్లు 2,153 పెరిగినట్టు లోక్‌‌సభ క్వశ్చన్‌‌ అవర్‌‌లో చెప్పారు.నీట్‌‌ ద్వారా సుమారు 75 వేల సీట్లను భర్తీచేస్తామన్నారు. ఈ ఏడాది మార్చినాటికి దేశంలో 19.47 లక్షల మంది అల్లోపతి, ఆయుర్వేద, యునానీ, హోమియోపతి డాక్టర్లు ఉన్నారని హర్షవర్థన్‌‌ చెప్పారు.

ప్రైవేటుకు  కొన్నియూనిట్లు: రైల్వే మంత్రి గోయల్‌‌

రైల్వేలను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం చేయమని ఆశాఖమంత్రి పీయూష్‌‌ గోయల్‌‌ శుక్రవారం లోక్‌‌సభకు హామీ ఇచ్చారు. దేశప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని  కొత్త లైన్లు, ప్రాజెక్టుల్లో మాత్రం  ప్రైవేటు పెట్టుబడుల్ని ఆహ్వానిస్తామన్నారు.1950––2014 లో 77,609 కిలోమీటర్లున్న ట్రాక్‌‌  గత ఐదేళ్లలో 1, 23,236 కి.మీ.కు పెరిగిందని మంత్రి చెప్పారు.

Latest Updates