ఢిల్లీలో జాతీయజెండా ఎగురవేసిన కిషన్ రెడ్డి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్ ప్రోటోకాల్‌కు అనుగుణంగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి కార్యాలయ సిబ్బంది కూడా పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన వ్యక్తులతో మంత్రి మాట్లాడుతూ.. దేశానికి పవిత్రమైన, ముఖ్యమైన ఈనాటి ప్రాముఖ్యతను మంత్రి గుర్తుచేసుకున్నారు. ‘స్వాతంత్ర్య పోరాటంలో మహానుభావులు అనుసరించిన మార్గం, స్వాతంత్య్ర సిద్దికోసం ఏ విధంగా పోరాటం చేశారో స్మరించుకుంటూ.. వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి గొప్ప విలువలను అందరూ అనుసరించాలని’మంత్రి కోరారు.

For More News..

దేశంలో 25 లక్షలు దాటిన కరోనా కేసులు

రాష్ట్రంలో 90 వేలు దాటిన కరోనా కేసులు

పన్నులు కట్టేది 1.5కోట్ల మంది! ఐటీఆర్ వేసేది 6.5కోట్ల మంది

Latest Updates