శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఊడ్చి క్లీన్ చేసిన కేంద్రమంత్రి

శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్వచ్ఛ్ భారత్ చేశారు కేంద్రమంత్రి పరుషోత్తం రూపాలా. ఢిల్లీ నుంచి వచ్చిన ఆయనకు  జాగరణ జనతా ఫౌండేషన్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికింది. ఆయనకు పూలమాల వేసి సత్కరించారు. తర్వాత ఆ పూలమాలను అక్కడి నుంచి తీసి ఊడ్చి క్లీన్ చేశారు పరుషోత్తం రూపాలా .  స్వచ్ఛ్ భారత్ లో భాగంగా ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలోని ఆత్మకూరు,అమరచింత మండలంలో పాల్గొనేందుకు వెళ్తున్నారు పరుషోత్తం రూపాలా.