సామాన్యుడిని మంత్రిని చేయడం బీజేపీకే సాధ్యం: ప్రతాప్ సారంగి

union-minister-prathap-sarangi-about-bjp

భువనేశ్వర్(ఒడిశా): ‘టీ అమ్ముకునే వ్యక్తి ని ప్రధానిగా,పేపర్లు వేసే వ్యక్తిని రాష్ట్రపతిగా, ఓ గుడిసెలో జీవించే సామాన్యుడిని కేబి నెట్ మంత్రిగా చేయడం బీజేపీకి మాత్రమే సాధ్యం ’ అని కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగి అన్నారు. ఆదివారం భువనేశ్వర్ లో జరిగిన ఓ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​తో సారంగి హాజరయ్యారు. మంత్రులుగా బాధ్యతలు స్వీ కరించిన తర్వాత తొలిసారి గా నగరానికి వచ్చిన ప్రధాన్ సారంగిలను బీజేపీ స్థానిక నేతలు సన్మానించారు.ఈ సందర్భంగా సారంగి మాట్లాడుతూ.. స్కూలుకు వెళ్లే వయసులో పేపర్లు వేసిన ఏపీజే అబ్దుల్​కలాంను
వాజ్ పేయి సర్కారు దేశానికి ప్రథమ పౌరుడిని చేసిందన్నారు. గుడిసెలో జీవించే తనపై నమ్మకంతో ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర కేబి నెట్​హోదా కట్టబెట్టారని చెప్పారు. ప్రధాని నమ్మకాన్ని వమ్ముకానీయనని అన్నారు. మంత్రి పదవిని తానేనాడూ ఆశించలేదని, పదవే తనను వెదుక్కుంటూ వచ్చిందన్నారు. ఈ కొత్త బాధ్యతలను సంతోషంగా స్వీకరించానని, ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం సుకుంటా నని సారంగి చెప్పారు.

Latest Updates