కేంద్రమంత్రి, ఎల్‌జేపీ అధినేత రాంవిలాస్‌ పాశ్వాన్ క‌న్నుమూత‌

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, ఎల్‌జేపీ అధినేత రాంవిలాస్‌ పాశ్వాన్(74)‌ కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యం పాలైన ఆయనకు ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో హార్ట్ స‌ర్జ‌రీ జ‌రిగింది. ఈ క్రమంలోనే గురువారం ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌ వెల్లడించారు.

తన తండ్రి మరణం గురించి చిరాగ్ పాశ్వాన్ ట్వీట్ చేస్తూ.. “పాపా… ఇప్పుడు మీరు ఈ ప్రపంచంలో లేరు కానీ మీరు ఎక్కడ ఉన్నా ఎల్లప్పుడూ నాతోనే ఉంటార‌ని తెలుసు. మిస్ యు పాపా అని పేర్కొన్నారు.

Latest Updates