హీరోయిన్‌ను పార్టీలో చేర్చుకున్న మరుసటి రోజే కేంద్ర మంత్రికి కరోనా

కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే కరోనావైరస్ బారినపడ్డారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడైన ఆయన ఆదివారం హీరోయిన్ పాయల్ ఘోష్‌ను తన పార్టీలో చేర్చుకున్నారు. ఆ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత కొన్ని గంటలకే ఆయనకు దగ్గు, బాడీ పెయిన్స్ రావడంతో సోమవారం కరోనా పరీక్ష చేయించుకున్నారు. ఆ పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు మంగళవారం నిర్ధారణ అయింది. దాంతో అథవాలే ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అథవాలేకు కరోనా సోకడంతో.. పాయల్ ఘోష్ పార్టీలో చేరిన కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ భయాందోళనకు గురవుతున్నారు. తనతో కాంటాక్టులో ఉన్నవాళ్లందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని అథవాలే కోరారు.

తాజాగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా కరోనావైరస్ బారినపడ్డారు. వైద్యుల సలహా మేరకు ఆయన దక్షిణ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు.

For More News..

ఎంపీ బండి సంజయ్ మీద జరిగిన దాడిపై స్పందించిన సిద్ధిపేట సీపీ

రాజాసింగ్ వీడియో: నేను దుబ్బాక వస్తున్నా.. ఎవడు ఆపుతాడో చూస్తా..

కేక్ కట్ చేసిన కాసేపటికే కానరానిలోకాలకు.. బర్త్‌డేనే డెత్ డే అయింది

Latest Updates