కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు మహమ్మారి బారినపడి కోలుకోగా.. మరికొందరు మృత్యువాతపడ్డారు. తాజాగా కేంద్ర మంత్రి స్మృతి మహమ్మారి బారినపడ్డారు. దీంతో ఆమె సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. తనను క‌లిసిన వారంతా వెంటనే కరోనా టెస్టులు నిర్వహించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ‘‘నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. నాతో టచ్‌లోకి వచ్చిన వారందరూ వెంటనే కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు. ఇంతకు ముందు కేంద్ర మంత్రులు అమిత్‌షా, పహ్లాద్‌జోషి, నితిన్‌ గడ్కరీ, ధర్మేంద్ర ప్రదాన్‌, అర్జున్‌రామ్‌, యశోనాయక్‌ శ్రీపాదతో పాటు మరికొందరు మంత్రులు, పదుల సంఖ్యలో ఎంపీలు మహమ్మారి బారినపడ్డారు.

Latest Updates