కేంద్ర మంత్రి పదవి …PMO నుంచి ఫోన్ వచ్చినా వెరిఫై చేసుకోండి

కేబినెట్ ఏర్పాటు పై రకరకాల కథనాలు వస్తుంటాయని, ఎంపీలను గందరగోళానికి గురిచేసేలా ఉంటాయని మోడీ అన్నా రు. ‘‘ఇప్పుడు అందరిలో జరిగే చర్చ కేంద్ర కేబినెట్ ఏర్పాటుపైనే. మీకు పీఎంవో పేరిట ఎవరైనా ఫోన్ చేసి.. మీ పేరు మంత్రుల లిస్టులో ఉందని చెప్పొచ్చు. రాష్ట్రపతికి ఇచ్చిన లిస్టులో కూడా ఉందని నమ్మించొచ్చు. మీడియాలో వార్తల మీద వార్తలు రావొచ్చు. అది మనను అయోమయానికి, గందరగోళానికి గురిచేస్తుంది . మీకు మంత్రి పదవి వచ్చినట్లు సాక్షాత్తు పీఎంవో నుంచి ఫోన్ వచ్చినా ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకోండి” అని ఎంపీలకు సూచించారు. ప్రధాని, మంత్రి పదవులు ముఖ్యంకాదని, ఎన్నుకున్న ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే ముఖ్యమని అన్నా రు. ‘‘నేను మీలో ఒక్కడిని. మీతో పాటు ఎంపీని. మీతోపాటు కార్యకర్తను . నాకు, మీకు ఎలాంటి తేడా లేదు. అందరం కలిసి పనిచేద్దాం ” అని సూచించారు.

Latest Updates