ప్రధాని మోడీకి ఏరియల్ ఎటాక్ ​ముప్పు!

  • సెక్యూరిటీ వింగ్స్​కు హోంశాఖ లెటర్

న్యూఢిల్లీరిపబ్లిక్​ డే (జనవరి 26)  నేపథ్యంలో ప్రధాని మోడీకి ఉగ్ర ముప్పు పొంచి ఉందని హోంమంత్రిత్వ శాఖ హెచ్చరించింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కంటెంట్, వీడియోలు పోస్ట్ చేస్తున్నారని తెలిపింది. ప్రధాని మోడీపై ఏరియల్​ఎటాక్​జరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు పారామిలటరీ దళాల డైరెక్టర్ జనరల్, ఇంటెలిజెన్స్ బ్యూరో, స్పెషల్ ప్రొటెక్షన్​గ్రూప్ చీఫ్​లకు లేఖ రాసింది. ‘‘ప్రధాని మోడీకి వ్యతిరేకంగా బెదిరింపు లేఖలు, వీడియోలు ఇటీవల సోషల్ మీడియోలో పోస్ట్ చేస్తున్నారు. కొంతమంది అసభ్యకరంగా పోస్ట్​లు పెడుతున్నారు. శత్రువులు ఎంతకైనా తెగించే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండాలి” అని లెటర్​ లో పేర్కొంది. ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పింది. బెదిరింపు హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీకి అదనపు బలగాలను పంపించామని, రిపబ్లిక్​డే, బీటింగ్ రిట్రీట్ సెరోమనీ (జనవరి 29)కి టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నామని ఓ అధికారి తెలిపారు.

Latest Updates