ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్న ఎన్టీఆర్ నయా లుక్

హైదరాబాద్: టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ గా పేరు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ బుధవారం 37వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. తారక్ బర్త్ డే కావడంతో ఆయన ఫ్యాన్స్ ఇప్పటికే హ్యాపీ బర్త్ డే ఎన్ టీఆర్ ట్యాగ్స్ తో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ట్రెండింగ్ చేస్తున్నారు. 20 ఏళ్ల కెరీర్ లో అద్భుతమైన నటనకు తోడుగా అదిరిపోయే మాస్ డ్యాన్స్ మూమెంట్స్ తో ఎంతో మంది హృదయాల్లో తారక్ చెదరని ముద్ర వేశాడు. ముఖ్యంగా ఇంటెన్స్ తో కూడిన ఫైట్స్ చేయడంతోపాటు ఎమోషనల్ సీన్స్ ను పండించడంలో ఈతరం హీరోల్లో తారక్ శైలి ప్రత్యేకమని విశ్లేషకులు చెప్తుంటారు.

తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా గ్లింప్స్ విడుదల చేద్దామని భావించింది. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా ఆర్ఆర్ఆర్ లో తారక్ కు సంబంధించిన గ్లింప్స్, వీడియోకు సంబంధించిన వర్క్స్ పూర్తవకపోవడంతో విడుదల చేయలేకపోతున్నామని చెప్పింది. దీంతో కొంత నిరాశకు లోనైన అభిమానుల్లో ఫిట్ నెస్ ట్రెయినర్ లాయిడ్ స్టీవెన్స్ సంతోషం నింపేందుకు ప్రయత్నించాడు. తారక్ తన యాబ్స్ తోపాటు చీజిల్స్ బాడీని చూపిస్తూ ఇచ్చిన ఓ స్టైలిష్ లుక్ ను లాయిడ్ ట్విటర్ లో షేర్ చేశాడు. ఇప్పుడు ఈ ఫొటో ఇంటర్ నెట్ ను ఊపేస్తోంది. ప్రముఖ ఫొటోగ్రాఫర్ దబూ రత్నానీ తీసిన ఈ ఫొటోలో తారక్ బాడీని చూసి ఫ్యాన్స్ అదుర్స్ అంటున్నారు. అరవింద సమేతలో తారక్ కు ఫిట్ నెస్ ట్రెయినర్ గా పని చేసిన లాయిడ్.. ఆర్ఆర్ఆర్ మూవీ కోసం మరోసారి తారక్ తో జట్టు కట్టాడు. జనవరిలోనే ఆర్ఆర్ఆర్ లో తారక్ లుక్ కు కావాల్సిన ట్రెయినింగ్ పూర్తయిందని లాయిడ్ పేర్కొన్నాడు. అయితే దీని కంటే కూడా నెక్స్ట్ లుక్ ప్రేక్షకుల మతి పోగొడుతుందన్నాడు.

Latest Updates