పుల్వామా దాడి క్రూరమైన, పిరికి చర్య : ఐక్యరాజ్య సమితి

ఈ నెల 14న జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో CRPF కాన్వాయ్ పై జరిగిన ఉగ్రదాడిని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఖండించింది. ఆ దాడికి పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థే కారణమంది  భద్రతా మండలి. అతి క్రూరమైన, పిరికి చర్యలను తీవ్రమైన పదజాలంలో ఖండిస్తున్నామని… ప్రకటన చేసింది భద్రతా మండలి. అన్ని దేశాలు… భద్రతా మండలి నిబంధనలకు లోబడి భారత్ కు సహకరించాలని సూచించింది. అయితే దీనిని అడ్డుకునేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నించింది.

Latest Updates