భారత్‌కు ధన్యవాదాలు తెలిపిన ఐక్యరాజ్య సమితి

భారతదేశానికి ఐక్కరాజ్య సమితి ధన్యవాదాలు తెలిపింది. సరైన సమయంలో పన్నులు చెల్లించినందుకుగాను భారత్‌ సహా మరో మూడు దేశాలకు కూడా ఐక్కరాజ్య సమితి ధన్యవాదాలు చెప్పింది. మొత్తం 193 దేశాల్లో గడువుకన్నా ముందే పన్నులు చెల్లింది కేవలం నాలుగు దేశాలేనని తెలిపింది. భారత్‌ 23,396,498 డాలర్ల టాక్స్ 01.02.2020 నాటికి చెల్లించాల్సి ఉంది. అయితే ఇంకా గడువు ఉండగానే భారత్‌ చెల్లింపులు పూర్తి చేసినందుకు భారత్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. అంతేకాకుండా భారత్‌తో పాటు పోర్చుగల్‌, ఉక్రెయిన్‌, అర్మేనియాలు ఇప్పటికే పన్నులు చెల్లించాయి. 2019 సంవత్సరానికి చెందిన టాక్స్ లకు సంబంధించిన పన్నులు ఇంకా చెల్లించాల్సిన దేశాలు 10ఉన్నాయని ఐక్యరాజ్య సమితి తెలిపింది.

 

Latest Updates