చదువంటే మెడిసిన్‌‌‌‌‌‌‌‌, ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ కాదు

చదువంటే ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌, మెడిసిన్‌‌‌‌‌‌‌‌ అనే భావన పేరెంట్స్‌‌‌‌‌‌‌‌లో పెరిగిపోతోందని, ఇది మారాలని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. ‘ప్రమాణాల నిర్థారణ, నాణ్యత విశిష్ట సంఖ్య’ అంశంపై జాతీయ స్థాయి సెమినార్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో సోమవారం జరిగింది. ఇందులో మంత్రి మాట్లాడుతూ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌లో ప్రశ్నించే తత్వాన్ని పెంచాలని, విద్యాలయాలు సైంటిస్టుల తయారీ కేంద్రాలుగా మారాలని అన్నారు. విద్యావ్యవస్థలో ఇంకా మార్పులు రావాలని, ఇప్పటికీ బ్రిటిష్ కాలంనాటి విద్యావిధానమే ఉందన్నారు. చదువంటే ర్యాంకులు, మార్కులు అనే భావన కూడా పోవాలన్నారు. ప్రపంచంలోని వంద టాప్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీల్లో దేశం నుంచి ఒక్కటీ లేకపోవడం పరిశోధనల్లో వెనుకబడి ఉండడానికి కారణమని, ఇందులో రాజకీయ పార్టీల బాధ్యతా రాహిత్యం కూడా ఉందన్నారు. దేశం నుంచి మోథో వలసలు జరుగుతున్నాయని, వాటికి అడ్డుకట్ట వేయాలని నీతి ఆయోగ్‌‌‌‌‌‌‌‌ సభ్యులు డాక్టర్‌‌‌‌‌‌‌‌ విజయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ సరస్వత్‌‌‌‌‌‌‌‌ అన్నారు. టెక్నాలజీ 4.0గా ఉంటే, విద్యావిధానం 2.0 గానే ఉందన్నారు. సైన్స్‌‌‌‌‌‌‌‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌, మ్యాథమెటిక్స్(స్ర్టీమ్‌‌‌‌‌‌‌‌) అంశాలపైనే నీతి ఆయోగ్‌‌‌‌‌‌‌‌ దృష్టి సారించినట్టు చెప్పారు. ‘విందాం- నేర్చుకుందాం’ నినాదంతో ముందుకు పోతున్నట్టు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. ఉన్నత విద్యామండలి చైర్మన్‌‌‌‌‌‌‌‌ తుమ్మల పాపిరెడ్డి,  వైస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్లు లింబాద్రి, వెంకటరమణ, టెక్నికల్‌‌‌‌‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌ నవీన్‌‌‌‌‌‌‌‌ మిట్టల్‌‌‌‌‌‌‌‌, సెక్రటరీ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రావు, వీసీలు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

Latest Updates