బస్టాండులో గుర్తుతెలియని మహిళ మృతదేహం.. శవం పక్కన..

హుజురాబాద్ బస్టాండ్ ఆవరణలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభించింది. ఆమె వయసు 45 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండొచ్చని తెలుస్తుంది. ఆమె మృతదేహం పక్కనే ఒక బస్ టికెట్ లభించింది. ఆ టికెట్ ద్వారా ఆమె కరీంనగర్ నుండి చిగురుమామిడికి ప్రయాణించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. ఆమె మృతదేహం పక్కనే ఓ క్రిమిసంహార మందు డబ్బాను పోలీసులు గుర్తించారు. దాంతో ఆమె ఆ విషం తాగి చనిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ మార్చురీకి తరలించారు.

For More News..

రాష్ట్రపతికి 10వ తరగతి బాలుడి లెటర్

చైనా బిలియనీర్ కు భారత కోర్టు సమన్లు

Latest Updates