100ఏళ్ల తరువాతే ఈ సినిమా విడుదల

సాధారణంగా సినిమాలంటే ఆరు నెలలో, లేదంటే సంవత్సరం, డైరక్టర్ రాజమౌళి సినిమాలైతే రెండేళ్లు, మూడేళ్ల సమయం పడుతుంది. హాలీవుడ్ లో ఐదేళ్లు, ఆరేళ్లకు రిలీజ్ అవుతాయి. ఈ హాలీవుడ్ సినిమా మాత్రం 100ఏళ్లకు రిలీజ్ అవుతుంది. వందేళ్ల తరువాత రిలీజ్ చేసేంత ఏముందని.. ఆ  సినిమా స్టోరీ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసినా… 2115లో విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేశారు.

100year ద మూవి యూ విల్ నెవర్ సీ. ఫ్రాన్స్ దేశానికి చెందిన రాబర్ట్ రోడ్రిగ్జ్ అనే దర్శకుడు తెరకెక్కించాడు. షూటింగ్ కంప్లీట్ అయినా ఈ సినిమాను హైటెక్ బుల్లెట్ ఫ్రూఫ్ లో దాచి పెట్టారు. సరిగ్గా వందసంవత్సరాల తరువాత అంటే నవంబర్ 18, 2115న ఆటో మేటిగ్గా లాక్ ఓపెన్ అయ్యేలా ఏర్పాటు చేశారు. అలా 100 సంవత్సరాల తరువాత మనం ఎంత అభివృద్ధి చెందుతాం. టెక్నాలజీ ఎలా ఉండబోతోంది. అనే దానిని ఊహించి ఈ సినిమాను తీశారు. ఏది ఎలా ఉన్నా ఇప్పుడున్న వాళ్లెవరూ చూసే అవకాశం లేదు. ఈ సినిమా గురించి తెలుసుకున్నవాళ్లు..సినిమా తియ్యడం దేనికి దానికి లాక్ చేయడం దేనికి అని సెటైర్లు వేస్తున్నారు.

Latest Updates