బిర్యానీ అమ్మినందుకు దాడి.. వీడియో వైరల్

కాలం మారుతున్నా, టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నా.. ఇంకా మన దేశంలో కులాల పేరుతో జరిగే దాడులు మాత్రం ఆగడం లేదు. దళిత వర్గానికి చెందిన వ్యక్తి బిర్యానీ అమ్మినందుకు కొందరు వ్యక్తులు అతన్ని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన యూపీలోని గ్రేటర్ నోయిడాలో రబుపురాలో జరిగింది. ఈ ప్రాంతం దేశ రాజధాని ఢిల్లీకి 66 కిలోమీటర్ల దూరంలో ఉంది. దళిత వ్యక్తి అయిన లోకేష్ బిర్యానీ అమ్ముతున్నందుకు కొందరు వ్యక్తులు అతన్ని కులం పేరుతో దుర్భాషలాడుతూ కొట్టారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. దానికి సంబంధించిన వీడియో మాత్రం శనివారం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. గతంలో ఒకసారి లోకేష్‌ను ఇక్కడ బిర్యానీ అమ్మవద్దని హెచ్చరించినట్లు తెలుస్తోంది. హెచ్చరించినా కూడా లోకేష్ బిర్యానీ అమ్మడంతో వారు లోకేష్‌పై దాడిచేశారని సమాచారం.

‘రోజూవారిలాగానే నేను అక్కడికి నా రిక్షాలో బిర్యానీ తీసుకొని వెళ్లి అమ్ముతున్నాను. అంతలోనే ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చి నా కులం ఏంటని అడిగారు. నేను చెప్పగానే నాపై దాడి చేయడం మొదలుపెట్టారు. నేను తెచ్చిన బిర్యానీని కింద పడేయడమే కాకుండా.. నా రిక్షాను కూడా పూర్తిగా నాశనం చేశారు’ అని బాధితుడు లోకేష్ చెప్పారు.

‘మేము ఈ వీడియోను శనివారం చూశాము. లోకేష్‌ను పిలిపించి దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశాము. నిందితుల కోసం వెతుకుతున్నాం’ అని గ్రేటర్ నోయిడాలోని సీనియర్ పోలీసు అధికారి రణవిజయ్ సింగ్ తెలిపారు.

పెళ్లి జరిగిన కాసేపటికే షాకిచ్చిన వధువు

50 పైసల కోసం తలుపులకు నోటీసులంటించిన బ్యాంకు సిబ్బంది

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన నటి ఊర్మిలా మతోండ్కర్ దీనిపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. ‘భారతీయులమైన మనం ఇలాంటి సంఘటనలకు గురికాకుండా ఉండలేము. కానీ, ఇలా చేయడం మన నాగరికత కాదు. ఈ ఘటన సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ ఆలోచనకు పూర్తిగా వ్యతిరేకం’అని ఆమె ట్వీట్ చేశారు.

దాడి వీడియో

Latest Updates