లిమిట్​ పెంచుతమని.. అన్​ లిమిటెడ్​ దోపిడీ

క్రెడిట్​ కార్డుల్లో బ్యాలెన్స్​ కొల్లగొడుతున్న కేటుగాళ్లు​

డిజిటలైజేషన్​ పేరిట నయా మోసాలు

-క్యాష్​ వోచర్ల ఆశ చూపి వల వేేస్తారు

ప్రతి నెల 8 నుంచి12  కంప్లయింట్లు

అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు

హైదరాబాద్‌‌, వెలుగు: క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని సైబర్ దొంగలు నయా మోసాలకు పాల్పడుతున్నారు. కార్డు లిమిట్, డిజిటలైజేషన్ పేరుతో క్రెడిట్ బ్యాలెన్స్ ఊడ్చేస్తున్నారు. ఇలా ప్రతి నెలా 8 నుంచి12 కేసులు నమోదవుతుండగా, కస్టమర్లు అలర్ట్ గా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. బుధవారం సోమాజిగూడకు చెందిన ప్రైవేట్ ఎంప్లాయ్‌‌ అభిలాశ్  అకౌంట్‌‌ నుంచి సుమారు 35 వేల వరకు పోయాయి. అతడి ఖాతా పూర్తి వివరాలు అడిగి అకౌంట్‌‌ బ్యాలెన్స్‌‌ పెంచుతామని, కార్డు డిజిటలైజేషన్‌‌ అయ్యాక, ట్రాన్జాక్షన్స్‌‌ ఆన్‌‌లైన్‌‌లో చేసుకోవచ్చని చెప్పి నమ్మించడంతో  నిజమే అనుకొని అతడు పూర్తి వివరాలు చెప్పడమే కాకుండా తన ఫోన్‌‌కు వచ్చిన ఓటీపీ నెంబర్‌‌ కూడా చెప్పాడు. ఆ వెంటనే తన ఖాతాలో బ్యాలెన్స్‌‌ అంతా ఖాళీ అయినట్లు మెసెజ్‌‌ రావడంతో గురువారం సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి ఈ— వాలెట్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇలా  వివరాలు తెలుసుకొని..

అభిలాశ్‌‌ ఆర్బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డులో రూ.53 వేలు బ్యాలెన్స్ ఉండగా, కొద్ది రోజుల కిందట రూ.16,400 షాపింగ్ చేశాడు. బుధవారం మధ్యాహ్నం +919125128096 నెంబర్‌‌ నుంచి అతనికి కాల్‌‌ వచ్చింది. అవతలి వ్యక్తి ప్రదీప్ కుమార్ గా పరిచయం చేసుకొని ముంబై మహాలక్ష్మి క్రెడిట్ కార్డ్ ఏజెన్సీ నుంచి కాల్ చేస్తున్నట్లు చెప్పాడు.  మరో మూడు నెలల్లో కార్డు డిజిటలైజ్ అవుతుందని, క్రెడిట్‌‌ కార్డు అకౌంట్‌‌ బ్యాంక్‌‌ యాప్ పని చేయదని, క్రెడిట్ లిమిట్ ను రూ.1.20లక్షలకు పెరుగుతుందని నమ్మించి వివరాలు అడిగాడు. డిజిటలైజేషన్ తర్వాత కార్డు వాడకుండానే మనీ ట్రాన్జాక్షన్స్‌‌ చేసుకోవచ్చని సూచించాడు. ఇదంతా నిజమని నమ్మిన అభిలాశ్‌‌ క్రెడిట్ కార్డు నంబర్, లిమిట్, డేట్ఆఫ్ బర్త్ తో పాటు బ్యాంక్ వివరాలను  చెప్పాడు. అనంతరం తను చెప్పిన విధంగా అప్‌‌డేట్‌‌ చేయకపోతే కార్డు పనిచేయదని, దీంతో పాటు రూ.8 వేల పాయింట్స్ వోచర్ రాదని హెచ్చరించాడు. మొబైల్‌‌కు వచ్చిన ఓటీపీ నెంబర్‌‌ను  అవతలి వ్యక్తికి చెప్పాడు. వెంటనే అభిలాశ్ అకౌంట్ లో బ్యాలెన్స్ మాయమై, జీరో బ్యాలెన్స్‌‌ ఉన్నట్లు మెసేజ్‌‌ వచ్చింది.

‘మొబీ క్విక్’ ట్రాన్స్ ఫర్ ద్వారా..  

ఓటీపీ చెప్పిన సెకన్ల వ్యవధిలోనే తన క్రెడిట్ బ్యాలెన్స్ ‘మొబీ క్విక్’ ఈ కామర్స్ యాప్ కి ట్రాన్స్ ఫర్ అయినట్లు అభిలాశ్ గుర్తించాడు. దీంతో వెంటనే కస్టమర్ కేర్ సెంటర్ కి కాల్ చేసి కార్డును బ్లాక్ చేయించాడు. కానీ అభిలాశ్ కు వచ్చిన కాల్ నెంబర్‌‌ ఆర్బీఎల్ బ్యాంక్ కాల్ సెంటర్ నుంచి వచ్చింది కాదని తెలిసింది.

కస్టమర్లు అలర్ట్‌‌‌‌గా ఉండాలి

ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసే కస్టమర్లు అలర్ట్‌గా ఉండాలి. డెబిట్, క్రెడిట్ కార్డు మోసాలు పెరిగిపోతున్నాయి. బ్యాంక్ అధికారలు ఎప్పుడూ కస్టమర్లకు ఫోన్ చేయరు. ఓటీపీ, సీవీవీ, కార్డు నెంబర్స్ ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని జరుగుతున్న కేసులు ఈ ఏడాది ఎక్కువగా నమోదయ్యాయి. మీకు ఇటువంటి సంఘటన ఎదురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

‌‌‌‌ – రఘువీర్, అడిషనల్​ డీసీపీ,  సైబర్ క్రైమ్, సీసీఎస్ హైదరాబాద్

మొబైల్స్​ ద్వారా తెగ కొనేస్తున్నరు

Latest Updates