అమెజాన్ లో ఇంటి దొంగలు

అన్ లోడింగ్ చేస్తున్న వస్తువులను మాయం చేస్తున్న సిబ్బంది

కంప్లయింట్ తో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్‌, వెలుగు : అమెజాన్ కంపెనీలో ఎలక్ట్రా నిక్ వస్తువులను మాయం చేస్తున్న ఆరుగురు సిబ్బందిని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీఐ విజయ్ కుమార్ తెలిపిన ప్రకారం.. ఎయిర్ పోర్ట్ పరిధిలోని అమెజాన్ కంపెనీలో అన్ లోడింగ్‌ సెక్షన్ లో కొంతకాలంగా ఎలక్ట్రా నిక్ వస్తువులు చోరీ అవుతున్నాయి. వస్తువులు తగ్గడంపై కంపెనీ అధికారులు ఈనెల16న పోలీసులకు కంప్లయింట్‌ చేయగా. కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా కంపెనీ సిబ్బంది సైదాబాద్ కి చెందిన బొట్టు సాయి కుమా ర్(20), బోడుప్పల్ కి చెందిన తక్కలపల్లి ప్రణవ్(20), నందిగామకు చెందిన సంటి ఆనంద్(21), కర్మన్ ఘాట్ కి చెందిన పడమటి మహేశ్‌(24), నాగర్ కర్నూల్ కి చెందిన చింతా కార్తీక్(22), ఫరూఖ్ నగర్ చెందిన ఇమ్రాన్(23) దొంగిలిస్తున్నట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని 4 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్స్‌ స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు.

 

Latest Updates