త్వరలో అన్​లాక్​ 2.0 గైడ్​ లైన్స్​!

  • ఇంటర్నేషనల్​ ఫ్లైట్స్​కు అనుమతిచ్చే అవకాశం

న్యూఢిల్లీ: జూన్​ లోపుగా కేంద్ర ప్రభుత్వం అన్​లాక్​ 2.0 గైడ్​లైన్స్​ను రిలీజ్​ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అన్​లాక్​ 2.0లో భాగంగా కొన్ని ఎంపికచేసిన రూట్లలో ఇంటర్నేషనల్​ ఫ్లైట్లకు అనుమతిచ్చే అవకాశం ఉందని చెప్పాయి. న్యూఢిల్లీ–న్యూయార్క్, ముంబై–న్యూయార్క్​ తదితర రూట్లలో ఫ్లైట్లను అనుమతించే చాన్స్​ ఉందన్నాయి. గల్ఫ్​ దేశాలకు కూడా విమానాలు తిప్పేందుకు ప్రైవేట్​ సంస్థలకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని అన్నాయి. ఎడ్యుకేషన్​ ఇనిస్టిట్యూట్లు, మెట్రో సర్వీసులను తెరవడానికి మాత్రం కేంద్రం మొగ్గు చూపడం లేదని, వాటి ఓపెనింగ్​కు మరింత కాలం పట్టే అవకాశం ఉందని వివరించాయి. వీటిని తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సిద్ధంగా లేకపోవడం కూడా కారణమని తెలిపాయి. జూన్​ 18 వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ జరిపిన వర్చువల్​ మీటింగ్​లో అన్​లాక్​ 2.0 గురించి ఆలోచిస్తున్నామని సంకేతాలిచ్చారు. అదే సమయంలో కరోనావైరస్​ ఇన్ఫెక్షన్​ను తగ్గించడం పైనా ఆయన వారితో చర్చించారు. లాక్​డౌన్​ రూమర్లకు వ్యతిరేకంగా పోరాడాలని, ప్రస్తుతం దేశం అన్​లాకింగ్​ ఫేజ్​లో ఉందని ఆయన చెప్పారు. పర్మిషన్ తీసుకున్నారా ? ఆ డబ్బులు తీసుకున్నట్లు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారా ? ఇది రూల్స్ ను బ్రేక్ చేయడం కాదా? ” అని మంత్రి చెప్పారు.

టెర్రరిస్ట్ బిన్ లాడెన్ అమరవీరుడంట!

Latest Updates