అమ్మాయి,అబ్బాయి కలిసుంటే హోటల్ సీజ్ చేస్తారా? హైకోర్ట్

పెళ్లి కానీ యువతీ యువకులు ఒకే హోటల్ రూమ్ లో ఉంటే తప్పేంటని మద్రాస్ హైకోర్ట్ ప్రశ్నించింది. తమిళనాడు కోయంబత్తూర్ కు చెందిన ఓ ఫైవ్ స్టార్ హోటల్ యాజమాన్యం పెళ్లికాని యువతీయువకులకు కలిపి ఒకే గదిని అద్దెకు ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఆ వార్తలపై స్పందించిన కోయంబత్తూర్ కలెక్టర్ కే.తిరురాజమని, రెవెన్యూ అధికారులు హోటల్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా పెళ్లికానీ యువతీయువకులకు ఒకే గదిని ఇస్తున్నట్లు గుర్తించారు.  వారికి మందు కూడా సర్వ్ చేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. దీంతో అధికారులు ఆ హోటల్ యజమాని పై కేసు నమోదు చేశారు.

కేసు  విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎంఎస్ రమేష్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవివాహితులకు హోటల్ రూమ్ లు అద్దెకిస్తే తప్పేంటని కలెక్టర్, రెవెన్యూ ఉన్నతాధికారుల్ని ప్రశ్నించారు..? అవివాహితులకు హోటల్ రూమ్ లు అద్దెకివ్వడంలో నిబంధనలు, చట్టాలు లేవన్నారు. యువతీయువకులకు ఒకే రూమ్ లో ఉండేందుకు ఇష్టపడినప్పుడు..అవివాహితులకు హోటల్ రూమ్ లను అద్దెకిచ్చారని, హోటల్ ను సీజ్ చేయడం చట్టవిరుద్దమన్నారు.

హోటల్ రూమ్ లలో మద్యం సరఫరా..

లైసెన్స్ లేకుండా హోటల్ లో మద్యం సరఫరా చేయడం చట్టవిరుద్దమని మద్రాస్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎంఎస్ రమేష్ హెచ్చరికలకు సమాధానంగా..హోటల్ లో బసచేసేందుకు వచ్చిన యువతీయువకులే మద్యం బాటిళ్లు తీసుకొచ్చారని హోటల్ యాజమాన్యం కోర్ట్ కు తెలిపింది.

అదే సమయంలో న్యాయమూర్తి ఎంఎస్ రమేష్ తమిళనాడు లిక్కర్ పాలసీ  గురించి వివరించారు. 1996 నాటి తమిళనాడు లిక్కర్ పాలసీల ప్రకారం ఒక వ్యక్తికి స్వదేశంలో సరఫరా చేసే విదేశీ మద్యం 4.5లీటర్లు, విదేశీ మద్యం 4.5లీటర్లు, 7.8 నుంచి తొమ్మిది లీటర్ల బీర్ ను అమ్మొచ్చనే విషయాన్ని గుర్తు చేశారు.

ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హోటల్ ను ఎలా సీజ్ చేస్తారని న్యాయమూర్తి..కలెక్టర్, రెవెన్యూ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. హోటల్ ను సీజ్ చేసేముందు యాజమాన్యం వివరణ కోరాలని, హోటల్లో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే తప్పేనని న్యాయమమూర్తి రమేష్ వ్యాఖ్యానించారు.

హోటల్ యాజమాన్యం నోటీసులు అందుకున్న రెండు రోజుల్లో హోటల్ రీఓపెన్ చేయాలని కోయంబత్తూర్ కలెక్టర్ తిరురాజమని, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Latest Updates