ఉన్నావ్ రేప్ బాధితురాలి పరిస్థితి విషమం  

ఉన్నావ్ రేప్ బాధితురాలిపై నిన్న (గురువారం) ఉదయం ఐదుగురు దాడి చేసి తగులపెట్టిన ఘటనలో ఆ యువతి ప్రస్తుతం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని , వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని చికిత్స చేస్తున్న వైద్యులు అంటున్నారు.

గురువారం తెల్లవారు జామున ఐదుగురు వ్యక్తులు ఆమెపై అత్యంత పాశవికంగా దాడి చేసి, కిరోసిన్ పోసి నిప్పంటించారు. తీవ్రగాయాలతో  ఆ మహిళ ప్రాణాలు కాపాడుకునేందుకు కిలోమీటరు దూరం వరకు పరుగెత్తింది. జరిగిన విషయాన్ని పోలీసులకు  ఫోన్ ద్వారా తెలియజేయడంతో..  వారు అక్కడికి చేరుకొని, ఆమెను లక్నో ఆసుపత్రికి తరలించారు. ఆమె శరీరం 90 శాతం వరకూ కాలిపోవడంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దార్ జంగ్  హాస్పిటల్ కు తరలించారు. అయితే ఆమె శరీర భాగాలన్ని బాగా దెబ్బతిన్నాయని, కోమాలో ఉందని చికిత్స చేస్తున్న అక్కడి డాక్టర్ శలభ్ కుమార్ చెప్పారు.

Latest Updates