రేప్ కేసు పెట్టిందని యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు

ఉత్తరప్రదేశ్ దారుణం జరిగింది. ఉన్నావోలో ఓ 20ఏళ్ల మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించారు ముగ్గురు నిందితులు. 90 శాతం కాలిన గాయాలతో ఆమె లక్నోలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆ దారుణానికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

బాధితురాలిపై గతంలో ఐదుగురు మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు వివరించారు. వారిపై బాధితురాలు కేసు పెట్టింది. దీంతో వారికి జైలు శిక్ష పడింది. బెయిల్ పై జైలు నుంచి విడుదలైన నిందితులు..తాము జైలుకు వెళ్లడానికి కారణమైన ఆమెను చంపేందుకు పెట్రోల్ పోసి నిప్పంటించారని తెలిపారు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

More News

లోన్ ఇవ్వలేదని బ్యాంక్ మేనేజర్ పై దాడి
విచారణలో గోప్యత.. ఘటనా స్థలానికి నేడు దిశ నిందితులు!
డాక్టర్ “దిశ” పై అభ్యంతరకర పోస్ట్ లు : స్మైలీ నాని అరెస్ట్
రేప్ కేసు పెట్టిందని యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు

Latest Updates