ఉన్నావ్ రేప్ బాధితురాలు మృతి

ఓ వైపు దిశ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండగా..ఉన్నావ్ అత్యాచార బాధితురాలు చనిపోయింది. కాలిన గాయాలతో  ఢిల్లీలోని సప్థార్ జంగ్ హాస్పిటల్ లో చేరిన ఆమె చికిత్స పొందుతుండగా.. గుండెపోటు రావడంతో శుక్రవారం రాత్రి మృతి చెందింది. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ బాధితురాలిపై 2018 డిసెంబర్ లో అత్యాచారం జరిగింది. ఈ కేసులో  అరెస్టయిన నిందితులు  నవంబర్ 30న బెయిల్ పై విడుదలయ్యారు.బాధితురాలిపై కక్ష పెంచుకున్న నిందితులు పక్కా ప్లాన్ తో గురువారం కోర్టుకు వెళుతుండగా అడ్డుకుని కిరోసిన్ పోసి నిప్పంటించారు. దీంతో 90 శాతం కాలిన గాయాలతో హాస్పిటల్ లో చేర్పించారు. చికిత్స పొందుతుండగానే శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందింది. కిరోసిన్ పోసిన నిందితులను తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు.

MORE NEWS:

ఉన్నావ్ రేప్ బాధితురాలు మంటల్లో కాలుతూ.. సాయం కోసం కిలోమీటరు పరుగు

భారీ ప్యాకేజీ కోసం రెజ్యూమ్‌లో అబద్ధాలు: మహిళకు జైలు

ఉన్నావ్ ఘటనలో నిందితులైన ఐదుగురిని చంపేయడానికి అర్హులని అన్నాడు బాధితురాలి సోదరుడు.తమ మధ్య  సోదరి లేదని.. వారిని చంపడం తప్ప అంతకు మించి ఇంకా ఏమి వద్దన్నారు.

Latest Updates