రేపటి వరకు లిక్కర్ షాపులు బంద్

శ్రీరామనవమి సందర్భంగా ఇవాల గ్రేటర్‌ హైదరాబాద్ లో మద్యం షాపులు బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో ఆదివారం ఉదయం నుంచి రేపు(సోమవారం) ఉదయం వరకు మద్యం షాపులు మూసివేయాలన్నారు. హైదరాబాద్‌తోపాటు, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలోని వైన్స్‌లు, కల్లు దుకాణాలు, బార్లను ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు మూసి ఉంచుతారు. శ్రీరామనవమి సందర్భంగా భారీఎత్తున హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో ఊరేగింపు కూడా జరగనుండటంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Latest Updates