బిగ్ బి అమితాబ్ కు అస్వస్థత

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్వల్ప అస్వస్థకు గురయ్యారు. దీంతో అమితాబ్ ప్రతి ఆదివారం తన అభిమానుల కోసం ఏర్పాటు చేసే  జల్సా ఇన్ జుహు కార్యక్రమాన్ని క్యాన్సల్ చేసుకున్నారు. 36 ఏళ్లుగా అమితాబ్ బచ్చన్ తన  ఇంట్లో అభిమానులను కలుసుకుంటారు.దీనికి జల్సా ఇన్ జుహు అని అంటారు. ఇవాళ కొంచెం అనారోగ్యం, నొప్పితో  బాధపడుతున్న అమితాబ్ ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు తన ట్విట్టర్లో తెలిపారు. ప్రస్తుతం కొంచెం నొప్పితో బాధపడుతున్న అభిమానులు ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పాడు అమితాబ్.

 

Latest Updates