రాజస్తాన్ లో రేప్ జరిగితే..మా రాష్ట్రానికి ఎందుకొచ్చారు : రాహుల్ పర్యటనపై యూపీ మంత్రి ఎదురు దాడి

హత్రాస్ దారుణంతో దేశం అట్టుడికిపోతుంది. ఓ వైపు అత్యాచార ఘటన మరోవైపు రాజకీయంతో ఉత్తర్ ప్రదేశ్ అట్టుడికిపోతుంది.

నలుగురు దుర్మార్గుల చేతిలో అత్యాచారానికి గురై..మరణించిన బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తన ముఖ్య అనుచరులతో కాన్వాయ్ లో ఉత్తర్ ప్రదేశ్ కు వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడ వారిని పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తగా మారింది. ఈ సందర్భంగా తనని ఓ పోలీస్ నెట్టి..లాఠీచార్జ్ చేశారని రాహుల్ గాంధీ తెలిపారు. దేశంలో కేవలం ప్రధాని మోడీ ఒక్కరే నడవాలా? మామూలు వ్యక్తులు నడవొద్దా? నన్ను ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేశారో చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అదే సమయంలో రాహుల్ గాంధీ ఉత్తర్ ప్రదేశ్ పర్యటనపై..ఆ రాష్ట్ర మంత్రి  సిద్ధార్థ నాథ్ సింగ్ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ లో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం జరిగిందని..బాధితులకు న్యాయం జరగాలని కోరుకుంటే  రాహుల్, ప్రియాంక గాంధీలు ముందుగా రాజస్థాన్ వెళ్లాలని మంత్రి సిద్ధార్థ ఎద్దేవా చేశారు.

Latest Updates