టీఆర్ఎస్ హయాంలో నిజాం పాలన:యోగి

పెద్దపల్లి:  టీఆర్ఎస్ పాలన చూస్తుంటే నిజాం పాలనను తలపిస్తోందన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్. పెద్దపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగి.. టీఆర్ఎస్ కు ఓటేస్తే ఎంఐఎంకు ఓటేసినట్లు..కాంగ్రెస్ కు ఓటు వేస్తే తీవ్రవాదులకు ఓటేసినట్లే అని అన్నారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు దేశ వ్యతిరేక శక్తులతో కుమ్మక్కయ్యాయని విమర్శించారు. టీఆర్ఎస్  ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేకపోయిందని అన్నారు. డబుల్ బెడ్ ఇళ్లు గానీ, గ్రామీణ మంచినీటి పథకాన్ని అమలు చేయడంలో విఫలమైందన్నారు యోగి.

దేశానికి  వ్యతిరేకంగా పనిచేసే పార్టీలకు ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. రామగుండంలో మూసివేసిన ఎరువుల ఫ్యాక్టరీని 5500 కోట్ల రూపాయలతో తెరిపించిన ఘనత బిజెపికే దక్కుతుందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వాదులకు బిర్యానీ పొట్లాలను అందిస్తే.. బిజెపి ప్రభుత్వం బుల్లెట్లతో సమాధానం చెప్పిందని అన్నారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి మరోసారి నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిని చేయాలని అన్నారు యోగి.

Latest Updates