యూపీ రేప్ బాధితురాలు మృతి ఘటనపై సిట్.. వారంలో నివేదిక

యూపీలో గ్యాంగ్ రేప్  బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన ఘటనపై ఆ రాష్ట్ర సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఘటనకు కారణమైన నేరస్థులను విడిచిపెట్టబోమని చెప్పారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి  ముగ్గురు అధికారులతో సిట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందానికి హోంశాఖ కార్యదర్శి భగవాన్ స్వరూప్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చంద్రప్రకాష్, ఐపిఎస్ అధికారి పూనమ్ నాయకత్వం వహించనున్నారని చెప్పారు.. ఈ ప్యానెల్ వారం రోజుల్లో నివేదిక అందిస్తుందని చెప్పారు. త్వరగా న్యాయం జరిగేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరపాలన్నారు.

హత్రాస్ జిల్లాలో సెప్టెంబర్ 14 న గ్యాంగ్ రేప్ కు గురై చిత్రహింసలు భరించి  15 రోజులపాటు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడిన దళిత యువతి  ఢిల్లీలోని సఫ్దార్ జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారు జామున3 గంటలకు చనిపోయింది. క్రూరంగా గ్యాంగ్ రేప్ చేసిన నలుగురు నిందితులు అగ్ర కులానికి చెందిన వాళ్లని, ప్రస్తుతం జైలులో ఉన్నారని పోలీసులు చెప్పారు.

ఒక్కరోజే 80,472 కేసులు..1179 మరణాలు

నేను లోకల్​లో ఉంటున్నా…మీరూ ఉండాలె

Latest Updates