యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కి పితృవియోగం

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిష్త్ కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన అనారోగ్యంతో న్యూఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. మార్చి 13న ఆయన్ను ఎయిమ్స్ లో చేర్పించారు. డాక్టర్లు తీవ్రంగా యత్నించినా ఆయన్ను కాపాడలేకపోయారు. అనంద్ సింగ్ బిష్త్ మరణం పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.

Latest Updates