యూపీలో డెంగ్యూ విలయం..

V6 Velugu Posted on Sep 15, 2021

ఉత్తరప్రదేశ్ లో డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రయాగ్ రాజ్ జిల్లాలో కొత్తగా 97, ఘజియాబాద్ లో 21 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. డెంగ్యూ రోగులకు ఆసుపత్రుల్లో వైద్య చికిత్స అందిస్తున్నామని తెలిపారు అధికారులు. దోమలవ్యాప్తితో  డెంగ్యూ జ్వరాలు ప్రబలుతుండటంతో ఫాగింగ్ చేపట్టారు. డెంగ్యూ జ్వరాల నివారణకు చర్యలు చేపట్టారు. యూపీలోని మీరట్, లక్నో, కాన్పూర్ ప్రాంతాల్లోనూ డెంగ్యూ, వైరల్ జ్వరాలు ప్రబలాయి. వైరల్ జ్వరాలు, డెంగ్యూ నివారణకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు అధికారులు. సీరియస్ గా ఉన్నవారిని హాస్పిటల్ లో ఉంచి ట్రీట్ మెంట్ అందిస్తున్నామని.. ఎప్పటికప్పుడు డెంగ్యూ రోగుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు.
 

Tagged Dengue cases, UP districts, uptick

Latest Videos

Subscribe Now

More News