బాలుడిని రేప్ చేసి, బతికుండగానే నిప్పు పెట్టి..

లక్నో: పదేళ్ల బాలుడిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడి, బతికుండగానే నిప్పంటించిన దారుణ ఘటన యూపీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగరాలోని కరేలి ప్రాంతంలో నివసిస్తున్న సల్మాన్ అనే 22 ఏళ్ల యువకుడు బుధవారం ఓ మైన‌ర్ బాలుడిని ఆడుకుందామని పిలిచి ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. భయంతో పిల్లవాడు కేకలు వేయడంతో ఆగ్రహించిన దుండగుడు ఆ బాలుడి గొంతు నులుముతూ, కత్తితో కోసేందుకు ప్రయత్నించాడు. దీంతో మైనర్ కొన్ని సెకన్ల పాటు స్పృహ కోల్పోయాడు. బాలుడు చనిపోయాడని భావించిన నిందితుడు సల్మాన్.. పొదల్లోకి లాక్కెళ్లి నిప్పంటించి పరారయ్యాడు. మంటలంటుకోగానే పిల్లవాడు సాయం కోసం కేకలు వేయగా.. స్థానికులు వచ్చి కాపాడి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుడు పిల్లవాడిని సోడోమైజ్ చేయడానికి ప్రయత్నించిన మొదటి కేసు ఇది అని పోలీసులు తెలిపారు. బాలుడికి పొత్తికడుపులో గాయాలయ్యాయని, కోలుకుంటున్నాడని తెలిపారు.

Latest Updates