పుట్టబోయే బిడ్డ ఎవరో తెలుసుకునేందుకు..భార్య గర్భాన్ని చీల్చిన కసాయి భర్త

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. తనకు పుట్టబోయే బిడ్డ అమ్మాయా,అబ్బాయా అని తెలుసుకునేందుకు ఓ కసాయి భర్త భార్య కడుపును చీల్చి చూసే ప్రయత్నం చేశాడు.

ఉత్తర్ ప్రదేశ్ సివిల్ లైన్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…సివిలైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పన్నాలల్ (35) భార్య ఏడునెలల గర్భిణి. ఇప్పటికే ఐదుగురికి జన్మనిచ్చిన నిందితుడు తనకు కొడుకు కావాలంటూ భార్యను నిత్యం వేదించేవాడు.

తాజాగా భార్య ఏడునెలల గర్భవతి కావడంతో తనకు పుట్టబోయే బిడ్డ ఎవరనేది తెలుసుకునేందుకు పదునైన చాకుతో భార్య గర్భాన్ని చీల్చాడు. దీంతో ఆ బాధను తట్టుకోలేని బాధితురాలి కేకలు వేసింది. బాధితురాలి కేకలతో అప్రమత్తమైన స్థానికులు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

నిందితుడు చేసిన దారుణంపై సమాచారం అందుకున్న సిటీ ఎస్పీ ప్రవీణ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, తనకు పుట్టబోయే బిడ్డ ఎవరనేది తెలుసుకునేందుకు భర్త పన్నాలల్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్పీ ప్రవీణ్ చెప్పారు.

Latest Updates