83 మంది తబ్లిగి సభ్యులపై కేసులు

లక్నో: కరోనా వైరస్ కారణంగా యూపీలోని సహారాన్‌పూర్‌లో నమోదైన ఆరు వేర్వేరు కేసుల్లో అరెస్టయిన 57 మంది విదేశీ పౌరులతో సహా 83 మంది తబ్లిగి జమాత్ సభ్యులపై యూపీ పోలీసులు ఆదివారం చార్జిషీట్ దాఖలు చేశారు. ఇప్పటికే 300 మంది తబ్లిగి సభ్యులు, 279 మంది ఫారినర్స్ యూపీలోని వివిధ జైళ్లలో ఉన్నారని, మిగతావారు బెయిల్ పై ఉన్నారని యూపీ పోలీసులు మీడియాకు వెల్లడించారు. కిర్గిస్తాన్, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, సుడాన్, ఫ్రాన్స్ తదితర దేశాలకు చెందినవారని తెలిపారు. జమాత్ లో పాల్గొన్నట్లు సమాచారం ఇవ్వకపోవడం, ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ కు సంబంధించిన ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించలేదంటూ వారిపై అభియోగాలు మోపారు. విజిటింగ్ వీసా మీద ఇక్కడకు వచ్చి మిషనరీ పనులు చేస్తున్నందుకు వీసా రూల్స్ ఉల్లంఘన జరిగిందని, వీరందరి వీసాలు బ్లాక్ లిస్ట్ చేసి రద్దు చేసినట్లు పోలీసులు వివరించారు. ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన తబ్లిగి జమాత్ కార్యక్రమంతో దేశంలో కరోనా వ్యాప్తి పెరిగింది. ఇప్పటివరకు ఢిల్లీలో 308 మంది ఫారినర్లతో సహా 2,500 మందికి పైగా తబ్లిగి సభ్యులపై 300 కేసులు నమోదయ్యాయి.

Latest Updates