పారతో మోరీ శుభ్రం చేసిన జిల్లా కలెక్టర్

స్వచ్ఛభారత్ సాధిద్దామంటూ.. ఓ జిల్లా కలెక్టర్ స్వయంగా మోరీ శుభ్రం చేశారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం రాంపూర్ జిల్లా కలెక్టర్.. ఆంజనేయ కుమార్ సింగ్… మురికి కాలువలోని చెత్తను తీశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే లక్ష్యంతో.. వారంరోజుల పాటు రాంపూర్ జిల్లాలో చెత్త ఏరివేసే కార్యక్రమాన్ని శనివారం పొద్దున ప్రారంభించారు కలెక్టర్ ఆంజనేయ కుమార్.

పనులు ఒకరికి చెప్పడమే కాదు.. తాను కూడా చేస్తేనే అందరూ ఆచరిస్తారన్న ఉద్దేశంతో… కలెక్టర్ పార పట్టారు. రాంపూర్ పట్టణంలోని ఓ మురికికాలువలో చెత్తను ఎత్తి పక్కన పోశారు. “పట్టణంలో మురుగునీటి కాలువలు, మోరీల్లో బాగా చెత్త ఉంది. అవి శుభ్రం చేయకపోవడం వల్ల మోరీలు అన్నీ నిండిపోయాయి. మురుగు నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయిన పరిస్థితి ఉంది. జన్మాష్టమి సందర్భంగా ఈ మంచి పని మొదలుపెట్టాం. వారంరోజుల పాటు కంటిన్యూ చేస్తాం.” అని కలెక్టర్ ఆంజనేయ కుమార్ చెప్పారు.

Latest Updates