పీఎం కేర్స్ కు చిన్నారుల కిడ్డీ బ్యాంక్ డ‌బ్బులు

లాక్ డౌన్ క్ర‌మంలో దేశ‌వ్యాప్తంగా జ‌న జీవ‌నం స్తంభించిన విషయం తెలిసిందే. దీంతో కరోనాను ఎదుర్కొనే ప్రజలు తమవంతు సాయమందించాలని ప్రధాని మోడీ, ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు పిలుపునిచ్చారు. ఈ క్ర‌మంలోనే ప‌లువురు ప్ర‌ముఖులు, సినీ స్టార్స్ తో పాటు చిన్నాపెద్ద తేడా లేకుండా విరాళాలు అంద‌జేస్తున్నారు. యూపీకి చెందిన ఇద్దరు చిన్నారులు తమ కిడ్డీ బ్యాంక్ లో ఉన్న నగదును ఆ పీఎం కేర్స్ రిలీఫ్‌ ఫండ్ కు అందజేసేందుకు ముందుకొచ్చారు.

యూపీకి చెందిన వ్యాపారవేత్త గౌరవ్‌ అరోరా కుమార్తెలు మేషా అరోరా (6), అలియా అరోరా (10) తమ కిడ్డీ బ్యాంకులో రూ.5 వేలు చొప్పున దాచుకున్నారు. దేశంలో కరోనా వైరస్‌ ను తరిమి కొట్టేందుకు చిన్నారులిద్దరూ తమ వంతు సాయంగా..ఈ మొత్తాన్ని పీఎం కేర్స్‌ రిలీఫ్‌ ఫండ్ కు అందజేయడం ప్రశంసించదగ్గ విషయమని డిస్ట్రిక్‌ మేజిస్ట్రేట్‌ శంభు కుమార్‌ అన్నారు.

Latest Updates