కరోనాతో ఇప్పటివరకు 41 మంది సైనికులు మృతి

రాజ్యసభలో మంత్రి శ్రీపాద నాయక్

న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఆర్మీ లో ఇప్పటివరకు 41 మంది చనిపో యారని, మొత్తంగా 22,353 మంది వైరస్​ బారిన పడ్డారని రాజ్యసభకు కేంద్రం శనివారం తెలిపింది.ఆర్మీలో వైరస్​ వ్యాపించకుండా కట్టుదిట్ట మైన చర్యలు తీసుకున్నట్టు రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్​నాయక్​ చెప్పారు. దాదాపు అన్ని ఆర్మీ హాస్పి టల్స్​లో కరోనా పేషెంట్ల కు వాడే మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. 2 ఆర్మీ హాస్పిటల్స్​ లో ప్లాస్మా థెరపీ ట్రీట్​మెంట్  అందిస్తున్నట్టు చెప్పారు. ఐఏఎఫ్​ వింగ్​లో  మొత్తం 1,875 మంది ఉమెన్​ ఆఫీసర్స్ పనిచేస్తున్నట్టు మంత్రి చెప్పారు.  వీరిలో 10 మంది ఫైటర్​ పైలట్లు, 18 మంది నావిగేటర్స్​అని శ్రీపాద నాయక్​ చెప్పారు.

For More News..

నీళ్లు, కరెంట్ బిల్లుల్లో 50% డిస్కౌంట్

2 వేల నోట్లపై ఇంకా నిర్ణయం తీసుకోలే

పాలకమండళ్లు లేని ప్రఖ్యాత దేవాలయాలు

Latest Updates