భర్తలు బ్రతికుండగానే పెన్షన్..వెలుగులోకి వచ్చిన కుంభకోణం..విచారణ చేపట్టిన కోర్ట్

ఉత్తర్ ప్రదేశ్ లో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. భర్తలు బ్రతికుండగానే 106మంది మహిళలు..తాము విడోలంటూ పెన్షన్ తీసుకుంటున్నట్లు గుర్తించినట్లు  బాదాయా జిల్లా అధికారి సంతోష్ కుమార్ తెలిపారు. అధికారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దీని వెనక ఉన్న అధికారుల హస్తం ఉందా అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పెన్షన్ కోసం తమ భర్తలు చనిపోయినట్టుగా సర్టిఫికెట్లు చూపించి పెన్షన్ పొందుతున్నట్లు చెప్పారు. ఇలా తీసుకుంటున్న మహిళలు వారి భర్తలు చనిపోయిన తర్వాత మరో పెళ్లి చేసుకున్నా కూడా డబ్బులు తీసుకుంటున్నారని, ఇలా బాదాయా జిల్లాలోనే ఏకంగా 891 మంది వితంతువులు చనిపోయినా కూడా వారి ఖాతాలో పెన్షన్ డబ్బులు జమయ్యాయి. ఈ కుంభకోణం వెలుగులోకి రావడంతో వారికి పెన్షన్ నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

పెన్షన్ వ్యవహారంపై ఇప్పటికే పలు కేసులపై విచారణ చేపట్టినట్లు జిల్లా మెజిస్ట్రేట్ కుమార్ ప్రశాంత్ చెప్పారు.

Latest Updates