భర్త బట్టలు కొనివ్వలేదని..ఆరు నెలల చిన్నారిని చంపింది

భార్యాభర్తల మధ్య చిన్న గొడవకు 6 నెలల చిన్నారి బలైంది. క్షణికావేశంలో ఓ తల్లిచేసిన పని పసిగుడ్డు ప్రాణం తీసింది. హోలీ పండుగకు భర్త బట్టలు కొనివ్వలేదన్నఆవేశంలో ఓ తల్లి చిన్నారిని కొట్టడంతో ఆపాప చనిపోయింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌ లో నిరాంపూర్‌‌కు చెందిన రాహుల్, పింకీ దంపతులు. వీరిద్దరికీ మూడేళ్ల బాబుతో పాటు 6 నెలల పాప ఉన్నా రు. ఈ ఆదివారం బట్టల విషయమై భార్యాభర్తల మధ్య గొడవజరిగింది. హోలీ పండగకు కొత్త బట్టలు కొనివ్వమని భర్త రాహుల్‌‌ తో పింకీ గొడవకుదిగింది. అది పెరిగి పెరిగి పెద్దదై క్షణికావేశంలో చేతిలో ఉన్న నెలల పసి పాపను నేలకేసి కొట్టింది. దీంతో ఆ పాప అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. భార్య పింకీపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Latest Updates