తెరపైకి యూపీఏ-3

ఢిల్లీ : మరో రెండు నెలల్లో జరుగనున్న లోక్ సభ ఎన్నికలకు వేడి రాజుకుంది. ప్రతిపక్షాల కూటమికి  ముచ్చట్లు మొదలయ్యాయి. ఒకవైపు మోడీ ఐదేళ్ల పాలనకు చివరి పార్లమెంట్​ సమావేశాలు బుధవారంతో ముగిశాయి. అదే వేదికపై మోడీ తన ప్రభుత్వం చేసిన పనులను ప్రస్తావిం చి.. మళ్లీ తానే రాబోతున్నట్లు చెప్పకనే చెప్పారు. మోడీని దించేందుకు ఎలా ముందుకు వెళ్లాలో ప్రతిపక్ష పార్టీలు కలిసికట్టు గా వ్యూహరచనలు ప్రారంభించాయి. ఢిల్లీలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ దీక్షలో పాల్గొన్న పార్టీల నేతలు సాయంత్రం పొద్దు పోయాక ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంట్లో సమావేశమయ్యారు.

ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి? కూటమిలో ఏ ఏ పార్టీలు ఉండాలి? ఇన్నాళ్లూ కాంగ్రెస్ నేతృత్వంలో కొనసాగిన యునైటెడ్​ ప్రొగ్రెసివ్ అలయెన్స్​ (యూపీఏ)గానే వెళ్దామా? అని చర్చిం చారు. సమావేశంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌‌ గాంధీ, టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, నేషనల్ కాన్ఫరెన్స్​ అధినేత ఫరూక్ అబ్దుల్లా, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, టీడీపీ చీఫ్ , ఏపీ సీఎం చంద్రబాబు తదితరులు పాల్గొ న్నారు. వీలైనంత త్వరగా మరోసారి సమావేశం కావాలని నేతలంతా ఓ నిర్ణయానికి వచ్చారు. కామన్ మినిమం ప్రోగ్రాంపై  డ్రాఫ్ట్​ను రాహుల్ గాం ధీ నేతృత్వంలో రూపొందించనున్నారు. దీనిపై ఈ నెల 26న చర్చిస్తారు. ఆ తర్వా త ఉమ్మడి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.

మోడీ విధానాలను వ్యతిరే కిస్తున్న పార్టీలన్నీ ఈ సమావేశంలో పాల్గొం టాయని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల ఐక్యతకు ఇటీవల జరిగిన సమావేశాలు, ధర్నాలు, దీక్షలే నిదర్శనమని పేర్కొన్నారు. కేజ్రీవాల్ దీక్ష కూడా మరోసారి ఐక్యతను చాటిచెప్పిందని, ఆయన కూడా యూపీఏలోకి రావడం ఖాయమైందని తెలిపారు. 2004 నుంచి 2009 వరకు

యూపీఏ–1గా సాగిన పార్టీలు .. అటు తర్వా త 2009 నుంచి 2014 వరకు యూపీఏ–2గా నడిచాయి. ఆ పదేళ్ల కాలం యూపీఏ అధికారంలో ఉంది. 2014లో యూపీఏ–3గా కలిసి వెళ్లాలనుకున్నా పెద్దగా ఫలితం ఇవ్వలేదు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారం చేపట్టింది. ఇప్పుడు మోడీని దించడమే లక్ష్యంగా యూపీఏ–3గా ప్రతిపక్షాలు ఏకం కావాలని భావిస్తున్నాయి. యూపీఏ–1, 2లో లేని పార్టీలు కూడా ఇందులో కలిసి రానున్నాయి. ముఖ్యంగా టీఎంసీతో పాటు టీడీపీ, ఆప్ కూడా కలవనుండటం గమనార్హం.

Latest Updates