ఆధార్ లో పిల్లల బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకోండి

ఆధార్ లో పిల్లల బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకోండి
  • పిల్లలు 5 ఏళ్ల వయసు నిండి ఉంటే అప్డేట్ తప్పనిసరి

మీకు 5ఏళ్ల వయస్సు నిండిన పాప లేదా బాబు ఉన్నారా? వీరికి గతంలోనే మీరు ఆధార్ కార్డు తీసుకున్నారా.. ? పిల్లల కోసం బాల ఆధార్ కార్డు గనుక తీసుకుని ఉంటే తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (Unique Identification Authority of India) భారతీయులకు చిన్న పిల్లల నుంచి మొదలు వయో వృద్దులకు ఆధార్ (వ్యక్తిగత ధృవీకరణ పత్రం) సంబంధిత సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. మన దేశంలో ప్రతి ఒక్కరూ ఆధార్ తీసుకోవడం చాలా అవసరం. అప్పుడే పుట్టిన పసికందుపేరుతో కూడా ఆధార్ తీసుకోవచ్చు. చిన్న పిల్లలు అంటే ఐదేళ్ల లోపు వారికి బాల ఆధార్ తీసుకోవాలి. 
ఈ బాల ఆధార్ తీసుకునే సమయంలో పిల్లల ఫోటో మాత్రమే తీసుకుంటారు. ఆ సమయంలో బయోమెట్రిక్స్ అంటే వారి వేలిముద్రలు, ఐరిస్ స్కాన్లు బాల్ ఆధార్ కార్డుతో లింకు చేయరు. పిల్లలకు 5 ఏళ్లు నిండిన తర్వాత బయోమెట్రిక్స్(ఐరిస్ స్కాన్, వేలిముద్రలు)ని ఆధార్ కార్డులో అప్డేట్ చేసుకోవాలి. తాజాగా యుఐడీఏఐ మరోసారి 5 ఏళ్లు నిండిన పిల్లలు తప్పనిసరిగా బయోమెట్రిక్స్ అప్ డేట్ చేసుకోవాలని ప్రకటించింది. అలాగే పదేళ్ల లోపు తీసుకున్న కూడా వారి బయోమెట్రిక్స్ ఆధార్ లో ఉన్నాయో.. లేదో చెక్ చేసుకుని.. లేని పక్షంలో అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ ట్వీట్ ద్వారా ప్రకటించింది. చిన్న వయసులో తీసుకున్న బయోమెట్రిక్స్ 15 ఏళ్లు దాటాక మారిపోతాయి కాబట్టి మరోసారి ఫ్రెష్ గా అప్డేట్ చేసుకుంటే మంచిది.అత్యవసర సమయాల్లో ఆధార్ కార్డులో వివరాలేవీ అప్డేట్ లేకపోతే.. మీ పిల్లలకు సంక్షేమ పథకాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి చెక్ చేసుకుని మళ్లీ అప్డేట్ చేసుకుంటే మంచిది.