యూపీలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడ్ని చితకబాదిన మహిళలు

ఉత్తరప్రదేశ్ లోని జలౌన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనుజ్ మిశ్రా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఇద్దరు మహిళలు ఆయనను చితకబాదారు. కొంతకాలంగా అనుజ్ మిశ్రా తమను వేధిస్తూ.. ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వారు ఆరోపించారు. ఈ క్రమంలో ఆ ఇద్దరు మహిళలు అనుజ్ మిశ్రాను ఓ బహిరంగ ప్రదేశంలో దొరకబుచ్చుకుని చెప్పులతో చితకబాదారు. తప్పైంది..క్షమించమంటూ  ఆ మహిళల కాళ్లకు మొక్కే ప్రయత్నం చేసినా వాళ్లు అతడిని వదిలిపెట్టలేదు.

ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఈ ఘటనపై దృష్టి సారించారు. దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటనపై అనుజ్ మిశ్రా  మాత్రం ..తన ప్రత్యర్థులు చేసిన కుట్ర అని ఆరోపించారు. ఆ ఇద్దరు మహిళల్లో ఒకరు పార్టీ పదవుల్లో ఉన్నారని, సీనియర్ నాయకుల ఆదేశాలతో తాను ఆమెను తొలగించానని, అందుకే తనపై కోపంతో దాడి చేసిందని ఆరోపించారు. అంతేకాదు.. ఆమె ఇల్లు కట్టుకుంటుంటే అవసరమైన మెటీరియల్ కు కూడా తానే డబ్బులు చెల్లించానని అనుజ్ మిశ్రా తెలిపారు.

Latest Updates