పెళ్లి సంబంధాలు చెడ‌గొడుతున్నాడ‌ని జేసీబీతో షాపు కూల్చేశాడు

పొరుగింటి వ్య‌క్తి తనకొచ్చే పెళ్లి సంబంధాల‌ను చెడ‌గొడుతున్నాడ‌నే కోపంతో జేసీబీతో అతని షాపును కూల్చేశాడు ఓ యువ‌కుడు. వివరాల్లోకి వెళితే… కేరళ రాష్ట్రం కన్నూరు జిల్లాకు చెందిన 30 ఏళ్ల అల్బిన్‌ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇంట్లో వాళ్లు అతడికి ఇప్పటికే ఎన్నో సంబంధాలు చూసినా ఫలితం దక్కలేదు. దీంతో తమ పొరుగున షాపు యజమానే ఇందుకు కారణమని భావించిన అల్బిన్‌, అతడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని భావించాడు. ఈ క్రమంలో సోమవారం జేసీబీతో సదరు షాపును కూలగొట్టేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

‘‘ఈ షాపును వేదికగా చేసుకుని అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు, గ్యాంబ్లింగ్‌ ఆడుతున్నారు, మద్యం వ్యాపారం చేస్తున్నారు. ఈ విషయం గురించి ఎన్నోసార్లు పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేశాం. కానీ ఎవరూ పట్టించుకోలేదు. అందుకే నేను ఆ షాపును కూల్చేశాను’’ అని షాపును కూల్చేముందు ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు అల్బిన్. అయితే షాపు ను కూల్చేసినందుకు అల్బిన్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.

Latest Updates