యూరియా కొరత.. వ్యవసాయ అధికారులపై ఎమ్మెల్యేలు ఫైర్

వరంగల్ రూరల్ జిల్లా వ్యవసాయ అధికారుల తీరుపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకట్రమణ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. జడ్పీ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి అధ్యక్షతన జిల్లా సర్వ సభ్య సమావేశం జరిగింది. యూరియా అందక రైతులు ఇబ్బంది పడుతుంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వ్యవసాయ శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, అవసరమైన యూరియా అందుబాటులో ఉంచి రైతులు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. దీంతో స్పందించిన కలెక్టర్ హరిత… యూరియా కొరత లేకుండా చూస్తామని ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు.

Latest Updates