US పర్యావరణ అవార్డుకు మోడీ ఎంపిక

ప్రధాని నరేంద్ర మోడీకి ఐక్యరాజ్యసమితి అత్యున్నత పర్యావరణ అవార్డును ప్రకటించింది. 2022 వరకు ప్లాస్టిక్ వినియోగాన్ని బ్యాన్ చేయాలంటూ ప్రతిజ్ఞ చేయడంతోపాటు దేశ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించి విస్తృత అవగాహన కల్పిస్తున్నందుకు ఈ అవార్డును ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా సోలార్ వినియోగం అందుబాటులోకి రావాలంటూ అంతర్జాతీయ నేతలతో కూడా దీనిపై చర్చలు జరుపుతున్నందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలకు ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రధాని మోడీతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రన్‌లను ఈ అవార్డుకు ఎంపిక చేసింది ఐక్యరాజ్యసమితి. ఇద్దరు నేతలు అంతర్జాతీయ సౌరవిద్యుత్ కూటమి ఏర్పాటుకు వీరు నాయకత్వం వహిస్తుండటం అదే సమయంలో ప్రకృతిని పరిరక్షించుకోవడంలో వీరు చేస్తున్న కృషి అద్భుతమని తెలిపింది US. పర్యావరణ పరిరక్షణ కోసం శ్రమిస్తున్న ఆరుగురిని కూడా ఈ సందర్భంగా ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డును ప్రకటించింది US.

ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు ఐక్యరాజ్యసమితి అత్యున్నత పురస్కారం. ఈ అవార్డును పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న వారికి అందజేస్తారు. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోనే కాక, పౌరసమాజంలోని వ్యక్తులు కూడా పర్యావరణ పరిరక్షణ కోసం వారు చేసిన కృషి తద్వారా పర్యావరణం పై పాజిటివ్ ఇంపాక్ట్ ఏర్పడితే అలాంటి వారికి ఈ పురస్కారాన్ని అందజేస్తోంది ఐక్యరాజ్య సమితి.

Posted in Uncategorized

Latest Updates