లోకల్ ఎలక్షన్లలో సత్తాచాటిన ఇండియన్ అమెరికన్స్

వాషింగ్టన్: అమెరికాలో జరిగిన స్టేట్‌‌‌‌‌‌‌‌, లోకల్‌‌‌‌‌‌‌‌ ఎలక్షన్లలో నలుగురు ఇండియన్‌‌‌‌‌‌‌‌ అమెరికన్లు విజయం సాధించారు. గజాలా హష్మీ అనే ముస్లిం మహిళ వర్జీనియా స్టేట్ సెనేట్‌‌‌‌‌‌‌‌కు ఎన్నికవగా, వర్జీనియా స్టేట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌‌‌‌‌‌‌‌గా సుహాస్ సుబ్రమణ్యం గెలిచారు.  మనో రాజు, డింపుల్ అజ్మీరా అనే మరో ఇద్దరు కూడా లోకల్‌‌‌‌‌‌‌‌ ఎలక్షన్లలో సత్తా చాటారు. వీరిలో హష్మీ వర్జీనియా స్టేట్ సెనేట్‌‌‌‌‌‌‌‌కు ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా చరిత్ర సృష్టించారు. డెమొక్రాట్‌‌‌‌‌‌‌‌ పార్టీ నుంచి పోటీ చేసిన హష్మీ తొలి ప్రయత్నంలోనే వర్జీనియా 10వ సెనేట్‌‌‌‌‌‌‌‌గా ఉన్న రిపబ్లికన్‌‌‌‌‌‌‌‌ పార్టీ అభ్యర్థి గ్లెన్‌‌‌‌‌‌‌‌ స్టర్టేవాంట్‌‌‌‌‌‌‌‌ను ఓడించి అందరి దృష్టిని ఆకర్షించారు. హిల్లరీ క్లింటన్‌‌‌‌‌‌‌‌ హష్మీని అభినందించారు. హష్మీ ఫ్యామిలీ 50 ఏళ్ల క్రితమే ఇండియా నుంచి అమెరికా వెళ్లింది. హష్మీ జార్జియాలోని చిన్న టౌన్‌‌‌‌‌‌‌‌లో పెరిగారు. స్థానిక సమస్యలపై పోరాడారు. జార్జియా సదరన్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎమోరీ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌‌‌‌‌‌‌‌డీ తీసుకున్నారు. ఆ తర్వాత భర్త అజార్‌‌‌‌‌‌‌‌తో కలిసి 1991లో రిచ్‌‌‌‌‌‌‌‌మండ్‌‌‌‌‌‌‌‌ ఏరియాకు వెళ్లారు. అక్కడ వర్జీనియా యూనివర్సిటీలో 25 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం రేనాల్డ్స్‌‌‌‌‌‌‌‌ కమ్యూనిటీ కాలేజీలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ (సీఈటీఎల్‌‌‌‌‌‌‌‌) వ్యవస్థాపక డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నారు.

సుహాస్ సుబ్రమణ్యం..

అమెరికా మాజీ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ బరాక్ ఒబామా టైంలో వైట్ హౌస్ టెక్నాలజీ పాలసీ అడ్వైజర్‌‌‌‌‌‌‌‌గా పనిచేసిన సుహాస్ సుబ్రమణ్యం వర్జీనియా స్టేట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌‌‌‌‌‌‌‌గా ఎన్నికయ్యారు. బెంగళూరుకు చెందిన సుబ్రమణ్యం కుటుంబం1979లో అమెరికా వెళ్లింది. సుబ్రమణ్యం తల్లి డల్లాస్‌‌‌‌‌‌‌‌లో ఫిజీషియన్‌‌‌‌‌‌‌‌గా చేశారు. అక్కడే సుబ్రమణ్యం కాపిటల్ హిల్‌‌‌‌‌‌‌‌లో హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్, వెటరన్స్ పాలసీ సహాయకుడిగా పనిచేశారు. ఆ తర్వాత ఒబామా గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో వైట్ హౌస్ టెక్నాలజీ పాలసీ సలహాదారుగా పని చేశారు.

 

Latest Updates