బోటు ప్రమాద మృతుల్లో ఇండియా జంట?

  • నాగ్‌‌పూర్‌‌‌‌కు చెందిన వారిగా అనుమానం

అమెరికాలోని కాలిఫోర్నియా శాంతాక్రజ్‌‌ దగ్గర సోమవారం బోటులో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇండియాకు చెందిన జంట ఉన్నట్లు తెలుస్తోంది. నాగ్‌‌పూర్‌‌లో పేరున్న పిడియాట్రిషన్‌‌ డాక్టర్‌‌‌‌ సతీశ్‌‌ డియోపుజారి కూతురు, అల్లుడు చనిపోయినట్లు కుటుంబసభ్యుడు ఒకరు చెప్పారు. అయితే దీనిపై ఇంకా అధికారిక సమాచారం రాలేదన్నారు. డెంటిస్ట్‌‌ అయిన సతీశ్‌‌ కూతురు సంజీరి డియోపుజారి యూఎస్‌‌ ఫైనాన్స్‌‌ కంపెనీలో పనిచేసే కౌస్తుభ్‌‌ నిర్మల్‌‌ను రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్‌‌అయ్యారు. ఇద్దరు స్కూబా డైవింగ్‌‌ కోసం సోమవారం వెళ్లారని, వారు వెళ్లిన బోటు మంటల్లో కాలిపోయిందని సన్నిహితులు చెప్పారు. అమెరికాలోని కాలిఫోర్నియా దగ్గర్లో స్కూబా డైవర్లను తీసుకెళ్తున్న  బోటు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురై నీటిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 34 మంది చనిపోగా.. ఐదుగురు సిబ్బంది నీటిలో దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు.

Latest Updates