హెలికాప్టర్ ప్రమాదంలో బాస్కెట్ బాల్‌ ప్లేయర్‌ కోబ్‌ మృతి

బాస్కెట్ బాల్ లెజండ్ గా పేరు తెచ్చుకున్న కోబ్ బ్రయంట్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయన కుటుంబసభ్యులు మరో 8 మంది కూడా మరణించారు. 41 ఏళ్ల కోబ్ అమెరికన్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఎన్బీఏ ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నిన్న(ఆదివారం) కోబ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లాస్ ఏంజిల్స్ కు అతి సమీపంలో అదుపుతప్పి కుప్పకూలింది. నగర శివార్లో ఈ ఘటన జరిగింది. హెలికాప్టర్ మొత్తం కూలుతూనే మంటల్లో చిక్కుకోవడంతో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగల్లేదు. హెలికాప్టర్ లోని మృతదేహాలన్నీ గుర్తుపట్టని విధంగా కాలిపోయాయి. ‘బ్లాక్ మాంబా’గా బాస్కెట్ బాల్ ప్రపంచంలో సుప్రసిద్ధుడైన కోబ్… దాదాపు 20 సంవత్సరాలకు పైగా క్రీడాభిమానులను అలరించాడు. చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన టాప్3 ప్లేయర్లలోనూ చోటు దక్కించుకున్నాడు.