రెమ్‌డిసివిర్ ఔష‌ధాన్ని మొత్తం కొనేసిన అమెరికా

రెమ్‌డిసివిర్ ఔష‌ధాన్ని అమెరికా సొంతం చేసుకుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉత్ప‌త్తి అవుతున్న ఈ డ్రగ్స్ ను మొత్తం ఆ దేశ‌మే కొనేసింది. క‌రోనా వైర‌స్ చికిత్స‌లో రెమ్‌డిసివిర్ డ్రగ్ మంచిగా ప‌నిచేస్తోంది. అయితే రెమ్‌డిసివిర్‌తో అమెరికా అసాధార‌ణ ఒప్పందం కుదుర్చుకున్న‌ది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా స‌ర‌ఫ‌రా అయ్యే ఆ ఔష‌ధాల‌ను త‌మ‌కే ఇవ్వాల‌ని డోనాల్డ్ ట్రంప్ ప్ర‌భుత్వం డీల్ కుదుర్చుకుంది. గిలీడ్ సైన్సెస్ సంస్థ ఈ డ్రగ్ ను  త‌యారు చేస్తున్నారు. ఈ ఔష‌ధం వాడిన వారు చాలా వేగంగా కరోనా నుంచి కోలుకుంటున్న‌ట్లు తేలింది.

డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమ‌న్ స‌ర్వీసెస్ శాఖ లేటెస్టుగా  ఓ ప్ర‌క‌ట‌న జారీ చేసింది. రెమ్‌డిసివిర్‌ను ఉత్ప‌త్తి చేసే గిలీడ్ సంస్థ‌తో ట్రంప్ స‌ర్కార్  ఒప్పందాన్ని కుదుర్చుకున్న‌ట్లు తెలిపింది. జూలైలో జ‌రిగే వంద శాతం ఉత్ప‌త్తిని అంటే సుమారు 5 ల‌క్ష‌ల డోస్‌ల‌ను త‌మ‌కే ఇవ్వాల‌ని గిలీడ్‌తో అమెరికా డీల్ చేసుకున్న‌ది. ఆగ‌స్టులో 90 శాతం, సెప్టెంబ‌ర్‌లో 90 ఔష‌ధ స‌ర‌ఫ‌రాను కూడా త‌మ‌కే ఇవ్వాల‌ని ట్రంప్ స‌ర్కార్ గిలీడ్‌తో అగ్రిమెంట్ కుదుర్చుకున్న‌ది.

Latest Updates