ట్రంప్ హయాంలో 13 మందికి మరణశిక్ష

వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హయాంలో13 మంది ఖైదీలకు మరణశిక్షలు అమలయ్యాయి. శనివారం తెల్లవారుజామున డస్టిన్ హిగ్స్ అనే ఖైదీకి మరణశిక్షను అమలుచేశారు. మేరీల్యాండ్ లోని వైల్డ్ లైఫ్ రిజర్వ్ లో 1996లో ముగ్గురు మహిళలను మర్డర్ చేసిన కేసులో హిగ్స్ కు మరణశిక్ష పడింది. అతడిని కోర్టు 2001లో దోషిగా తేల్చింది. ట్రంప్ హయాంలో ఇదే చివరి ఎగ్జిక్యూషన్. అయితే ట్రంప్ కంటే ముందు1963 నుంచీ కేవలం ముగ్గురికి మాత్రమే ఫెడరల్ గవర్నమెంట్ మరణశిక్షను అమలుచేసింది. దీంతో గత 58 ఏళ్లలో అందరికంటే ఎక్కువగా ప్రెసిడెంట్​ ట్రంప్​ పాలనలోనే మరణశిక్షలు అమలయ్యాయి.

గతేడాదిలోనే10 మందికి..

ట్రంప్ సర్కార్ కిందటేడాది కాలంలోనే 10 మందికి మరణశిక్షలు అమలుచేసింది. ఇటీవలే ముగ్గురికి ఎగ్జిక్యూషన్ పూర్తయింది. కరోనా సోకిన హిగ్స్​కు మరణశిక్షపై ఉన్న స్టేను సుప్రీంకోర్టు తొలగించడంతో శనివారం అమెరికా న్యాయ శాఖ శిక్షను అమలు చేసింది. ఇండియానా స్టేట్ టెరహౌట్ సిటీలోని జైలులో అతడికి పెంటాబార్బిటాల్ అనే లెథల్ ఇంజక్షన్ ఇవ్వడంతో మరణించాడు. బుధవారం కోరీ జాన్సన్, లిసా మాంట్ గామరీ, గురువారం జాన్సన్ అనే ఖైదీలకు కూడా మరణశిక్ష అమలైంది. వీరిలో లిసా.. ఓ మహిళను చంపి, ఆమె గర్భంలోని బిడ్డను తీసుకుని తన బిడ్డగా చెప్పుకున్నందుకు ఎగ్జిక్యూషన్ కు గురైంది. గత 70 ఏళ్లలో ఫెడరల్ గవర్నమెంట్ ఎగ్జిక్యూషన్ చేసిన ఏకైక మహిళ ఈమెనే. అయితే మరికొద్దిరోజుల్లో ప్రెసిడెంట్ పదవిని చేపట్టనున్న జో బైడెన్ మాత్రం మరణశిక్షలకు తాను వ్యతిరేకమని, ఫెడరల్ ఎగ్జిక్యూషన్​లకు ముగింపు పలుకుతానని ఇప్పటికే ప్రకటించారు.

లష్కరేకు టెర్రర్ డిసిగ్నేషన్ కొనసాగింపు 

పాకిస్తాన్​కు చెందిన లష్కరే తోయిబాకు టెర్రరిస్టు సంస్థగా డిజిగ్నేషన్ ను కొనసాగిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. లష్కరే తోయిబాతో పాటు వివిధ దేశాల్లోని లష్కర్ ఐ జాంగ్వీ, ఐఎస్ఐఎల్ సినాయ్ పెనిన్సులా, జయ్స్ రిజాల్ అల్ తారిక్ అల్ నక్షాబందీ, జమాతు అన్సరుల్ ముస్లిమినా, అల్ నుస్రత్ ఫ్రంట్, కంటిన్యుటీ ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ, నేషనల్ లిబరేషన్ ఆర్మీ సంస్థలపై అమెరికా విదేశాంగ శాఖ రివ్యూ చేసింది. వీటిని టెర్రరిస్టు సంస్థలుగా గుర్తిస్తూ ‘ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్’ల జాబితాలో ఉంచినట్లు వెల్లడించింది.

సీమ వర్మ రాజీనామా

ట్రంప్ సర్కార్ లో ‘సెంటర్స్ ఆఫ్​ మెడికేర్ అండ్ మెడికెయిడ్ సర్వీసెస్’ అడ్మినిస్ట్రేటర్​గా కీలక పదవిలో ఉన్న ఇండియన్ అమెరికన్ సీమ వర్మ గురువారం రాజీనామా చేశారు. హెల్త్ కేర్ అంశాల్లో ట్రంప్ కు చాలా నమ్మకస్తుల్లో ఒకరైన ఆమె నాలుగేళ్లుగా ఈ పదవిలో కొనసాగారు. ట్రంప్ ఈమెను వైట్ హౌజ్ కరోనావైరస్ టాస్క్ ఫోర్స్ లోనూ కీ మెంబర్ గా నియమించారు. ట్రంప్ సర్కార్ దిగిపోతున్నందున తాను తన పదవికి రాజీనామా చేస్తున్నానని, కొత్త అడ్మినిస్ట్రేటర్​కు బాధ్యతలు అప్పగిస్తానని
ఇండియన్​ అమెరికన్​ సీమ వర్మ తెలిపారు.

బైడెన్ టీంలోకి మరో ఇద్దరు ఇండో అమెరికన్లు

కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్ టీంలోకి మరో ఇద్దరు ఇండియన్ అమెరికన్లు చేరారు. వైట్ హౌస్​ కొవిడ్–19 రెస్పాన్స్ టీంలో టెస్టింగ్ అంశంపై పాలసీ అడ్వైజర్​గా ఇండోఅమెరి కన్ హెల్త్ ఎక్స్ పర్ట్ విదుర్ శర్మ నియమితు లయ్యారు. కొవిడ్ రెస్పాన్స్ టీంలో శర్మతో పాటు ఇతరుల పేర్లను బైడెన్ ప్రకటించారు. కొవిడ్ రెస్క్యూ ప్లాన్ అమలుకు ఈ టీమ్ కీలకమని, టీమ్ లోకి తీసుకున్న వాళ్లంతా చాలా కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నా రని ఆయన తెలిపారు. విదుర్ శర్మ ఒబామా హయాంలో డొమెస్టిక్ పాలసీ కౌన్సిల్ అడ్వైజర్ గా కూడా పనిచేశారు.

ఎకనమిక్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్‌‌గా సమీర

ఇండియన్ అమెరికన్ ఎకనమిక్ డెవలప్ మెంట్ ఎక్స్​పర్ట్ సమీర ఫజిలీ కూడా బైడెన్ టీమ్ లోకి ఎంపికయ్యారు. వైట్ హౌస్​లోని నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్​కు డిప్యూ టీ డైరెక్టర్​గా సమీరను ఎంపిక చేసినట్లు బైడెన్ ప్రకటించారు. ఎకనమిక్ పాలసీ తయారీ ప్రాసెస్ విషయంలో ఈ కౌన్సిల్ కోఆర్డినేట్ చేయనుంది. ఎకనమిక్ పాలసీ పై ప్రెసిడెంట్​కు సలహాలు ఇవ్వనుంది. సమీర ఇప్పటివరకూ బైడెన్-హారిస్ ట్రాన్సిషన్​కు ఎకనమిక్ ఏజెన్సీ చీఫ్​గా ఉన్నారు. అంతకుముందు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ​అట్లాంటాలో డైరెక్టర్​గా పనిచేశారు.

Latest Updates